»Cricketer Shami Joins Bjp Lok Sabha Ticket Guaranteed
cricketer Shami : బీజేపీలో చేరిన భారత క్రికెటర్ షమీ?
ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది.
cricketer Shami : ఇండియన్ పేసర్ మహ్మద్ షమీ అంటే భారత క్రికెట్ అభిమానులకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే క్రికెటర్ షమీని కొద్ది రోజుల్లో ఎంపీ షమీగా చూడబోతున్నాం. ఆయన్ని రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ మధ్య షమీ కమలం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నాడు. అంతెందుకు మొన్న మ్యాచ్ ఓడిపోయాక.. షమీని ప్రధాని మోడీ దగ్గరకు తీసుకొని హగ్ చేసుకోవడం వెనక కారణం కూడా ఇదే అంటున్నారు.
2024 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలకు మొహమ్మద్ షమీని బీజేపీ సిద్ధం చేస్తోంది. షమీ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా. ప్రపంచకప్ క్రికెట్లో అద్భుత ప్రదర్శనకు గుర్తుగా ఈ గ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ప్రకటించారు. గత కొంత కాలంగా బీజేపీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో షమీ కూడా పాల్గొంటున్నారు. ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి షమీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. హోంమంత్రి షమీని ఆశీర్వదించి వెంటనే పనులు ప్రారంభించాలని కోరినట్లు సమాచారం. బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన డానిష్ అలీ ప్రస్తుతం అమ్రోహా లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. షమీని ప్రత్యర్థిగా బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది.
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలో బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి షమీ అతిథిగా వెళ్లాడు. ఇదే కార్యక్రమానికి అమిత్ షా, అజిత్ దోవల్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా షా, షమీ కలిశారు. ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. దీంతో షమీ బీజేపీలో చేరతారనే ప్రచారం సాగింది. అయితే షా-షమీ భేటీతో క్లారిటీ వచ్చింది. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని, ఓ వేడుక సందర్భంగా జరిగిందని ఈరోజు స్పష్టం చేశారు.