»Mariya Ahmed Didi India Means 911 Call To Us Ex Ministers Key Comments
Mariya Ahmed Didi: భారత్ అంటే మాకు 911 కాల్.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
మాల్దీవులు, భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. మాల్దీవులు, భారత్కు మధ్య ఉన్న మైత్రీ గురించి చెప్పారు.
Mariya Ahmed Didi: మాల్దీవులు, భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. భారత ప్రధానిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. వాస్తవానికి భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశమని.. రక్షణ రంగం సహా వివిధ రంగాల్లో సహాయం అందిస్తోందని మారియా అహ్మద్ దీదీ చెప్పారు. భారత్తో కొనసాగుతున్న దీర్ఘకాల సంబంధాన్ని దెబ్బతీసేలా మాల్దీవుల మంత్రుల కామెంట్స్ ఉన్నాయన్నారు. మాల్దీవుల కోసం భారత్ 911 కాల్ (అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం కాల్ చేసే నంబర్. చాలా దేశాల్లో ఈ సేవను ఉపయోగిస్తున్నారు) వంటిదని తెలిపారు.
#WATCH | Male: On the row over Maldives MP's post on Prime Minister Narendra Modi, Former Maldives Defence Minister Mariya Ahmed Didi says, "… India has been our 911 call, whenever we need it, we give a call and you all come to our rescue. That kind of a friend. When you see… pic.twitter.com/9X64vqwWwg
అవసరమైన సమయాల్లో మా దేశాన్ని రక్షించడానికి భారత ఆర్మీ వచ్చింది. అన్నిదేశాలతో స్నేహం చేయడం అత్యవసరం. భారత్ ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తోందన్నారు. అందరితో స్నేహంగా ఉండే చిన్నదేశం మనది. రెండు దేశాలకు ఒకేరకమైన సవాళ్లున్నాయి. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ విషయంలో ఇరు దేశాలది ఒకే వైఖరి. చిరకాల స్నేహాన్ని దెబ్బతీసే ప్రయత్నం సరికాదన్నారు.