12th Fail: హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టిన 12th Fail మూవీ
ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 12th Fail. విధు వనోద్ చోప్రా దర్శకత్వంలో రూపోందిచిన ఈ చిత్రం ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో టాప్ ప్లేస్ ఉంది.
12th Fail: చిన్న సినిమాగా హిందీలో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం 12th Fail. థియేటర్లో దాదాపు రూ. 60 కోట్లు సాధించింది. ఇక ఓటీటీలో విడుదైన తరువాత మరింత మందికి చేరువైంది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th Fail బెస్ట్ మోటివేషనల్ మూవీస్ లిస్ట్‌లో చేరింది. విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే లీడ్ రోల్లో తెరకెక్కి తాజగా అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ)లో అత్యధిక రేటింగ్ పొందిన ఫిల్మ్‌గా రికార్డు సృష్టించింది. 2023లో విడుదలైన అన్ని హాలీవుడ్ చిత్రాలకంటే రేటింగ్‌లో టాప్ ప్లేస్‌ను సంతరించుకుంది. ఓపెన్‌హైమర్ (8.4) ఐఎమ్‌డీబీ రేటింగ్ పొందింది. అలాగే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన స్పైడర్ మ్యాన్: అక్రాస్‌ది స్పైడర్ వెర్స్ (8.6) రేటింగ్ ఉంది. వీటిని దాటుకొని 12th ఫెయిల్’ 9.2 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించింది.
చంబల్ ప్రాంతంలో పుట్టిన మనోజ్ 12 వ తరగతి ఫెయిల్ అవుతాడు. ఒక పోలీసును చూసి ఇన్స్పైర్ అయి యూపీఎస్ కోసం ఢిల్లీ వెళ్తాడు. చేతులో డబ్బులు లేకున్నా అక్కడే లైబ్రరీలో టాయిలెట్స్ కడుగుతూ, పిండి మరలో పనిచేస్తూ తన చదువును కొనసాగిస్తాడు. అక్కడే శ్రద్ధ అనే యువతితో పరిచయం ప్రేమగా మారుతుంది. తన జీవితంలో అనేక పరిస్థితులను దాటి ఎపీఎస్ అనే అతని అంతిమ లక్ష్యానికి ఎలా చేరుకున్నారు అనేది ఈ సినిమా కథ. 12th Fail మూవీ చాలా మందికి స్పూర్తిగా నిలిచింది. అందుకే ఐఎమ్‌డీబీ రేటింగ్ టాప్ ప్లేస్‌ను పొందింది.