Telangana: Telangana is the second place in recovery of phones!
Telangana: తెలంగాణ పోలీసులు మొబైల్ ఫోన్ల రికవరీలో రికార్డు సాధించారు. ఈ ఏడాది చోరీకి గురైన దాదాపు 30 వేల ఫోన్లను రికవరీ చేశారు. దేశం మొత్తం మీద ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానాన్ని సాధించింది. ఫోన్ ఎవరైనా దొంగతనం చేసినా లేదా మొబైల్ కనిపించకుండా పోయిన వెంటనే బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్, సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. గతేడాది కూడా ఫోన్ల రికవరీలో రాష్ట్ర పోలీసులు రికార్డు సాధించారు.
దేశంలో మొదటి స్థానంలో నిలిచారు. ఒక ఏడాదిలో రాష్ట్రంలో 1.73 లక్షల మొబైల్ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అందులో 35 శాతం మాత్రమే రికవరీ చేయగలిగారు. గతేడాది ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు కేవలం 29,500 మాత్రమేనని తెలిపారు. ఇంకా 1.43 లక్షల ఫోన్లు మిస్సింగ్లోనే ఉన్నట్లు సమాచారం.