ఆచార్య దెబ్బకు ముందు అనుకున్న కథను పక్కకు పెట్టేసి.. ఎన్టీఆర్ 30 కోసం కొరటాల శివ ఒక కొత్త సిద్ధం చేస్తున్నట్లు.. గత కొద్ద రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోను ఆచార్య ఎఫెక్ట్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పై పై పడకుండా.. కొరటాల పక్కాగా స్క్రిప్టు రెడీ చేస్తున్నాడని.. అందుకే ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా లేట్ అవుతోందని టాక్. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ చేస్తున్న సినిమా కావడంతో.. ఎన్టీఆర్ 30 అప్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవతుందనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో.. నందమూరి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్టనేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. జూన్ నుంచి పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూట్‌ను.. ఫైనల్‌గా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కొరటాల స్క్రిప్టు లాక్ చేసే పనిలో ఉండగా.. ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ ప్రత్రేక సెట్‌ను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. దాంతో త్వరలోనే షూటింగ్ అప్టేట్ ఇవ్వనున్నారట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇకపోతే ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో 31 ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. వచ్చే సమ్మర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా ఎన్టీఆర్-కొరటాల సెట్స్ పైకి వెళ్లాల్సిన అవసరం ఉంది.