NTR:దివంగత ఎన్టీఆర్ (NTR) కలకాలం మన మనస్సులో మిగిలిపోతారని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆయనతో అనుబంధం ఎప్పటికీ చిరస్మరణీయం అని తెలిపారు. ‘నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు, చిరకాలం, కలకాలం మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. కారణ జన్ముడు ఎన్టీఆర్ (NTR). తెలుగు జాతి ఘనకీర్తికి వన్నెతెచ్చిన రామారావుతో తన అనుంబంధం చిరస్మరణీయం అని’ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ (NTR) జయంతి సందర్భంగా చిరంజీవి స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఘట్ వద్ద నందమూరి బాలకృష్ణ (bala krishna), జూనియర్ ఎన్టీఆర్ (junior ntr), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అంజలి ఘటించారు.
ఎన్టీఆర్ (NTR) తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగు వారికి గర్వకారణం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) అన్నారు. ‘చరిత మరువని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే పేరు నందమూరి తారకరామారావు (NTR) . శతజయంతి సందర్భంగా అంజలి ఘటించారు.
ఎన్టీఆర్ జన్మించిన నేతలపై పుట్టడం తన అదృష్టం అని రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) అన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే బంగారు పూలతో పాదపూజ చేసేవాడినని తెలిపారు. తనకు ఎన్టీఆర్ గురువు, దైవం అని వివరించారు. ప్రజలను దేవుళ్లుగా ఎన్టీఆర్ భావించారని వివరించారు. కులరహిత సమాజం కోసం పాడుపడ్డారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ (NTR) గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరీపై ఉందన్నారు.