Sharvanand: యువ హీరో శర్వానంద్ (Sharvanand ) కారు ప్రమాదానికి గురయ్యింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఆయన కారు ఓ డివైడర్‌ను ఢీ కొంది. టూ వీలర్ తప్పించే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగింది. కారులో ముందు సీట్లో శర్వానంద్ (Sharvanand ) కూర్చొగా.. కారును డ్రైవర్ రాజు (raju) నడుపుతున్నారు. కారు రేంజ్ రోవర్ (Range Rover) కావడం.. సేప్టీ ఫీచర్స్ ఉండటంతో స్వల్పంగా గాయపడ్డారు. శర్వానంద్‌ను (Sharvanand ) సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి శర్వానంద్, అతని టీమ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
శర్వానంద్ (Sharvanand ) వివాహాం వచ్చేనెల 3వ తేదీన జరగనుంది. జైపూర్ లీలా ప్యాలెస్‌లో రక్షిత రెడ్డితో (Rakshitha Reddy( వివాహాం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇంతలో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. రక్షిత- శర్వానంద్‌కు జనవరి 26వ తేదీన నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి.. హైకోర్టు జస్టిస్ మధుసూదన్ రెడ్డి కూతురు అనే సంగతి తెలిసిందే. ఓ సినిమాలో నటిస్తూ శర్వానంద్ బిజీగా ఉన్నాడు. ఇంతలో ప్రమాదం జరిగింది.