ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తికేయ 2’ సినిమా.. యంగ్ హీరో నిఖిల్‌కు ఊహించని స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. మీడియం రేంజ్ అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు నిఖిల్.
తాజాగా నిఖిల్ నుంచి ’18 పేజెస్’ అనే సినిమా రాబోతోంది. కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో.. దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండంతో మంచి బజ్ ఏర్పడుతోంది. GA2 Pictures, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ లపై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అదే రోజు రవితేజ నటించిన ‘ధమాకా’ రిలీజ్ అవుతున్నా.. తగ్గేదేలే అంటున్నాడు నిఖిల్. దాంతో ఈ సినిమాపై గట్టి నమ్మకంతోనే ఉన్నాడు నిఖల్. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో వరుస అప్టేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
ఈ నేపథ్యంలో.. 18 పేజెస్ నుంచి ‘నన్నయ రాసిన’ అనే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నవంబర్ 22న ఆ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి కార్తికేయ2 హిట్‌తో జోష్ మీదున్న నిఖిల్‌కు.. 18 పేజెస్తో ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.