సీనియర్ హీరోయిన్ నయన తార క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు కదా.. రోజు రోజుకి పెరుగుతున్నట్టుగానే ఉంది. పెళ్లి చేసుకున్న కూడా నయన్ డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ఎంతలా అంటే.. పది సెకన్లకు కోటీ రూపాయలు ఇచ్చేంతలా ఉంది.
Nayanthara: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కోలీవుడ్, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దుమ్ములేపిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుంది. సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు నయన్, విఘ్నేష్. ప్రస్తుతం సంసార జీవితంతో పాటు.. హీరోయిన్‌గాను దూసుకుపోతోంది. వరుస సినిమాలు చేస్తోంది అమ్మడు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నయన తార టాప్ ప్లేస్‌లో ఉంది. గతేడాది ఈ ముద్దుగుమ్మ నటించిన బాలీవుడ్ మూవీ జవాన్.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రస్తుతం తమిళ్లో నయన తార చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి.
అయితే.. భారీ పారితోషికం తీసుకునే నయనతార.. కమర్షియల్‌గా కూడా దూసుకుపోతోంది. ఒక 50 సెకండ్ల యాడ్ కోసం నయన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన నయనతార.. ఆ యాడ్ కోసం భారీగా అందుకున్నట్టుగా తెలుస్తోంది. టాటా స్కై ప్రమోషనల్ 50 సెకండ్ల యాడ్ కోసం నయనతార ఏకంగా ఐదు కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే.. పది సెకన్లకు కోటి రూపాయలన్న మాట. ఈ లెక్కన నయన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే.. నయన తార సినిమాలు చేస్తుంది కానీ, ప్రమోషన్స్ కోసం రాదు. అలాగే.. యాడ్స్ కూడా పెద్దగా చేయదు. అయినా కూడా అమ్మడికి ఈ రేంజ్ డిమాండ్ అంటే మాటలు కాదు.