వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం నవంబర్ 1న ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా, అల్లు ఫ్యామిలీ ఇటలీకి వెళ్లిపోయారు. అయితే ఈ పెళ్లికి మాజీ జంట విడివిడిగా వెళ్తున్నారనే న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Naga Chaitanya and Samantha for Varun Tej italy wedding
గత వారం పది రోజుల నుంచే మెగా ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కొన్నేళ్లుగా ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అయిపోయారు. నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే హల్దీ, మెహందీ , సంగీత్ వేడుకలు మొదలయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన కాక్టైల్ పార్టీలో మెగా, అల్లు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇక ఈ పెళ్లిలో మెగా, అల్లు ఫ్యామిలీతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొందరు సెలబ్రిటీస్ కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే చాలామంది ఇటలీ ఫ్లైట్ ఎక్కేశారు.
ఈ లిస్ట్‌లో స్టార్ బ్యూటీ సమంత(Samantha) కూడా ఉంది. అలాగే నాగ చైతన్య(Naga Chaitanya) కూడా పెళ్లికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ పెళ్లిలో సమంత, నాగచైతన్యతో పాటు రష్మిక మందన్న సందడి కూడా చేయనుందట. వీరంతా.. వేరువేరుగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో.. వరుణ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ వివాహ వేడుకలో నాగచైతన్య, సమంత ఎదురెదురు కానున్నారు. వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటారా..? మాట్లాడుకుంటారా..? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
ఏ మాయ చేశావే సినిమాలో కలిసి నటించిన చై, సామ్ చాలా కాలం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే విడిపోయారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఇద్దరు ఎదురు పడలేదు. కానీ ఫస్ట్ టైం వరుణ్ తేజ్ పెళ్లిలో మాత్రం ఇద్దరు కలిసే(meet) అవకాశముంది. మరి చై, సామ్ కనీసం ఒకే ఫ్రేమ్‌లో అయిన బందీ అవుతారేమో చూడాలి.