వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే పెళ్లికి ముందు కాక్టెయిల్ పార్టీ(cocktail party) నిర్వహించగా..ఈ కార్యక్రమానకి హాజరైన స్టార్ హీరోలు, ఆ చిత్రాలను ఇప్పుడు చుద్దాం. రేపు నవంబర్ 1న మధ్యాహ్నం పెళ్లి జరగనుంది.
hero Varun Tej lavanya tripathi wedding cocktail party at italy Allu Arjun and Ram Charan attended
హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(lavanya tripathi) డెస్టినేషన్ వెడ్డింగ్ రేపే ఇటలీ(italy)లో జరగనుంది. ఈ నేపథ్యంలో సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్లో ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 30 సాయంత్రం వచ్చిన గెస్టులకు కాక్టెయిల్ పార్టీతో స్వాగతం పలికారు. ఇప్పుడు పెళ్లి తేదీ దగ్గర పడుతున్నందున సాంప్రదాయ వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు హల్దీ, మెహందీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన అతిథులు పసుపు, తెలుపు, గులాబీ రంగుల దుస్తులను ధరించాలని కోరారు. శుభ కార్యక్రమం అనంతరం పూల్ పార్టీ ఉంటుంది. పెళ్లి రోజు అంటే నవంబర్ 1న మధ్యాహ్నం 2.48 గంటలకు వివాహం జరగనుంది.
The Grand Mega Wedding rituals started last night with the cocktails party in ITALY😍✨🎉
ఈ కాక్టెయిల్ పార్టీ(cocktail party)కి వరుణ్ తేజ్ కజిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ సహా వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పార్టీకి వచ్చిన వారు నలుపు, తెలుపు దుస్తులను ధరించి ఉండగా..వరుణ్, లావణ్యలు మాత్రం సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన తెల్లని దుస్తుల్లో అద్భుతంగా కనిపించారు. ఆ క్రమంలో వారితో స్టైలిష్ గా పోజులిస్తు రామ్ చరణ్, అల్లు అర్జున్ వారి భార్యలతో కలిసి ఆ జంటతో ఫోటోలు దిగారు. ఈ అతిథుల జాబితాలో వరుణ్, లావణ్య తరఫు బంధువులు, స్నేహితులతో సహా దాదాపు 120 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా ఉన్నారు. ఈ పార్టీ వేడుకకు హాజరైన వారి చిత్రాలను ఇప్పుడు చుద్దాం.