ఈసారి అంతకుమించి అనేలా రాబోతోంది జనతా గ్యారేజ్ కాంబినేషన్. ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'దేవర' షూటింగ్.. ప్రస్తుతం గోవాలో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మరి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ?
నిన్న మొన్నటి వరకు భారీ సెట్టింగుల్లో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుపుకుంది దేవర సినిమా. కానీ రీసెంట్‌గానే అవుట్ డోర్ షూటింగ్ వెళ్లింది చిత్ర యూనిట్. ప్రస్తుతం గోవాలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు కొరటాల శివ. వీలైనంత త్వరగా గోవా షెడ్యూల్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది. మరి నెక్స్ట్ దేవర షెడ్యూల్ ఎక్కడ? అనే టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. గోవా షెడ్యూల్ అయిపోగానే కర్ణాటకలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం.
బెంగుళూరు సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నారట. అలాగే.. కర్ణాటక సముద్ర తీరంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఆ తర్వాత వైజాగ్ సహా ఏపీలో పలు ప్రాంతాల్లో దేవర షూటింగ్ జరగనుందని అంటున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. దాదాపు ఇండియాలోనే వివిధ లొకేషన్లలో దేవర షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
అసవరమైతే.. పాటల కోసం విదేశాలకు వెళ్లనున్నారట. ఈ లెక్కన.. దేవర షూటింగ్ మొత్తం ఇండియాలోనే జరగనుందన్నమాట. ఇక.. వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేసి.. నెక్స్ట్ హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అదే సమయంలో.. వార్2 కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు. మొత్తంగా ఎన్టీఆర్ మాత్రం జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.