»Minister Mallareddy Who Took Bollywood Pride In The Animal Pre Release Event
Minister Mallareddy: బాలీవుడ్ ఇజ్జత్ తీసిన మంత్రి మల్లా రెడ్డి
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి బాలీవుడ్ పరిశ్రమ గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ముంబయి పని అయిపోయిందని, అందరికీ హైదరాబాదే దిక్కు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Minister Mallareddy who took Bollywood pride in the animal pre-release event
Minister Mallareddy: యానిమల్(animal) సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమవారం మల్లారెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు రణబీర్ కపూర్(Ranabeer kapur) సహా యానిమల్ టీమ్ అంతా హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu) ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి(mallareddy) ప్రసంగం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్, హాలీవుడ్ పరిశ్రమలను తెలుగువాళ్లే శాసిస్తున్నారని, తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది తెలివైనవాళ్లు ఉన్నారని మల్లారెడ్డి అన్నారు.
రాజమౌళి, దిల్ రాజు లాంటి దిల్ ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇక ముంబయి పని అయిపోయింది, అది పాతది అయిందన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఎక్కువ అని అన్ని సదుపాయాలు ఉన్న ఏకైక పట్టణం హైదరాబాద్ మాత్రమే అని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 25 ఏళ్లు తెలుగు ప్రతిభావంతుల హావా నడుస్తుందని చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది నాటికి బాలీవుడ్ స్టార్లందరు భాగ్యనగరానికి రావలన్నారు.
మంత్రి మల్లారెడ్డి ఎక్కడైనా ఇలా ఉత్సహాంగానే ప్రసంగిస్తారు. యానిమల్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్‌లను సైతం తెలుగువాళ్లు ఏలుతున్నారు. ముంబాయ్ పాతది అయింది లాంటి మాటలను మీమ్స్‌గా వాడుతూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. బిజినెస్మెన్ సినిమా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి అన్నారు. ఆ సినిమాని పదిసార్లు చూశానని తెలిపారు. ఈ మాటలతో వేడుక మొత్తం కేరింతలు, చప్పట్లతో మార్మోగింది. పుష్ప సినిమాలో రష్మిక అదరగొట్టిందిని పేర్కొన్నారు. ఇక అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న యానిమల్ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.