Ravi Teja: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా కావ్యా థాపర్(Kavya Thapar), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ఈగిల్(Eagle). కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆడు మచ్చా(Aadu Macha) అనే మాస్ సాంగ్ విడుదలైంది. “తూరుపు తునక ఎరుపు బారెనే.. ఎలుగు దునికి దుంకులాడెనే.. ఎనుము ఎనక ఎనుము కదిలెనే.. ఆడు మచ్చా.. ఆడు మచ్చా.. ఆడు” అంటూ హుషారుగా సాగే ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రాశారు. దావ్ జాంద్ సంగీతం అందించారు. రవితేజ ఎనర్జీకి దీటుగా ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈగిల్ చిత్రం 2024 జనవరి 13న వరల్డ్ వైడ్గా విడుదల చేస్తున్నారు.