»We Used More Than 300 Tankers Of Water For Doota Web Series Sarath Marar
Sarath Marar: దూత వెబ్ సిరీస్ కోసం 300 పైగా ట్యాంకర్లకు నీటిని వాడాము!
నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ దూత. ఈ సిరీస్ మొత్తం వర్షంలోనే ఉంటుంది. అందుకోసం 300 పైగా ట్యాంకర్ల నీటిని వాడామని నిర్మాత శరత్ మారార్ తెలిపారు.
Sarath Marar: ట్యాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్(Vikram Kumar) హీరో నాగచైతన్య(Naga Chaitanya) కాంబినేషన్లో రూపోందించిన తాజా వెబ్ సిరీస్ దూత(Doota). ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ థ్రిల్లర్ ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. చై కూడా మొదటి సారి వెబ్ సిరీస్లో నటించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. సిరీస్ నిర్మాత శరత్ మరార్(Sarath Marar ) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కథ వినగానే తనకు, చైతన్యకు విపరీతంగా నచ్చిందని తెలిపారు. ఇది కచ్చితంగా మంచి సబ్జెక్ట్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే పెద్ద విజయం సాధించిందని వెల్లడించారు. ఆడియన్స్ ఊహాకు అందని విధంగా ఈ కథ ఉండడం, విక్రమ్ స్క్రీన్ ప్లే నడిపిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసిందని పేర్కొన్నారు.
కథగా విన్నప్పుడు చాలా సింపుల్గా అనిపించిందని, డైరెక్టర్ విక్రమ్ కుమార్ ట్రీట్మెంట్తో సిరీస్కు ప్రాణం పోశారన్నారు. 38 భాషల్లో సబ్ టైటిల్స్ కలిగిన సిరీస్ గా 240 దేశాల ప్రజలకు అందుబాటులోకి వెళ్లడం అనేది అన్నిటికంటే ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఇక తమ బ్యానర్ పేరును ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందని, దీంతో మరిన్ని పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా ఆసక్తి వచ్చిందన్నారు. అయితే ఈ కథ అంతా వర్షంలోనే ఉంటుందని, వర్షం కూడా ఒక క్యారెక్టర్లా కంటిన్యూ అవుతుందని విక్రమ్ ముందే చెప్పారన్నారు. అందుకే సిరీస్ పూర్తయ్యేసరికి 300లకి పైగా ట్యాంకర్ల నీళ్లను తెప్పించవలసి వచ్చిందని చెప్పారు. విక్రమ్ కుమార్ చెప్పినట్టుగానే, వర్షం ఎఫెక్ట్ వలన కథ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించిందని పేర్కొన్నారు.