లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా స్థాయిలో 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్ క్యాస్టింగ్‌తో ఈ చిత్రం రాబోతోంది. పైగా చాలా గ్యాప్ తర్వాత మణిరత్నం నుంచి వస్తున్న సినిమా కావడంతో.. పొన్నియన్ సెల్వన్ పై భారీ అంచనాలున్నాయి. ఇటీవల లాంచ్ చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రెహమాన్ ట్యూన్స్ ఆకట్టకునేలా ఉన్నాయి. దాంతో రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ గురించి ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. పీఎస్-1 డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటి సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా 125 కోట్లకు ఓటిటి రైట్స్ అమ్ముడపోయిందని ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే ఈ భారీ ఆఫర్ రావడం విశేషమనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్లు వినిపిస్తోంది. అందులో ఒకటి నెగెటివ్ రోల్ అని.. ఇంతకు ముందెన్నడు ఐశ్యర్యను అలాంటి పాత్రలో చూడలేదని కోలీవుడ్ వర్గాల మాట. ఇలా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పై ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచేస్తోంది. మరి బాహుబలితో పోలుస్తున్న పొన్నియన్ సెల్వన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.