ఈ సారి దసరాకు బాక్సాఫీస్ వార్ గట్టిగానే ఉండబోతోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున మధ్య బిగ్ క్లాష్ జరగబోతోంది. ఇక ఇప్పుడు మంచు విష్ణు తగ్గేదేలే అంటున్నాడు. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అయితే నాగ్ తన మూవీని పెద్దగా ప్రమోషన్స్ చేయడం లేదు. దాంతో ‘ది ఘోస్ట్’ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అయినా చిరుతో పోటి పడేందుకే నాగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఈ సారి దసరా వార్ చిరు, నాగ్ మధ్యే ఫిక్స్ అనుకున్నారు. ఇప్పటికే మెగాస్టార్ పొలిటికల్ డైలాగ్ ‘గాడ్ ఫాదర్’ పై భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఈ క్రమంలో చిరు, నాగ్‌లతో పోటీ పడేందుకు ఏ హీరో సాహసం చేయరనే చెప్పొచ్చు. కానీ మంచు విష్ణు మాత్రం రిస్క్ ఉంటేనే కిక్ అంటున్నాడు. విష్ణు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జిన్నా’ను గాడ్ ఫాదర్‌కు పోటీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. కొత్త దర్శకుడు సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్ని లియోన్ హీరోయిన్లుగా నటించారు. దాంతో ఇందులో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువే. అయినా విష్ణుకు రిస్క్ తప్పదనే చెప్పాలి. అసలే ఫ్లాఫ్స్ తర్వాత గ్యాప్ తర్వాత వస్తున్నాడు విష్ణు. పైగా ‘మా’ఎలక్షన్స్ వల్ల మంచు, మెగా వార్ జరిగింది. ఇక ఇప్పుడు ఏకంగా చిరుతోనే సై అంటున్నాడు. ఒకవేళ జిన్నా సినిమా బాగుంటే ఓకే.. కానీ ఏ మాత్రం తేడా కొట్టిన సరే.. ట్రోల్స్ రాయుళ్లు కాచుకు కూర్చున్నారు. కాబట్టి ఏ విధంగా చూసిన విష్ణుకు రిస్క్ తప్పదనే చెప్పాలి. అన్నట్టు అదే రోజు బెల్లంకొండ గణేష్ ‘స్వాతిముత్యం’ కూడా బరిలో దిగడం విశేషం.