మోహన్ బాబు వారసత్వాన్ని అందుకొని.. దొంగ దొంగది సినిమాతో 2004లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత నేను మీకు తెలుసా, పయనం, బిందాస్, ఝుమ్మంది నాదం, కరెంట్ తీగ, గుంటురోడు వంటి సినిమాలతో.. వైవిధ్యమైన హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నా మనోజ్.. 2017 నుంచి సినిమాలు చేయడం లేదు. ఇక ఆ తర్వాత కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మనోజ్.. 2019లో ప్రణతితో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి పెద్దగా లైమ్ లైట్లో లేడు మనోజ్. కానీ సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి.. ‘అహం బ్రహ్మస్మి’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చేశారు తప్పితే.. ఇప్పటి వరకు ఎలాంటి అప్టేట్ లేదు. దాంతో అసలు మనోజ్ ఏం చేస్తున్నాడనే చర్చ నడుస్తునే ఉంది.
అయితే తాజాగా వార్తల్లో నిలిచాడు మనోజ్. అది కూడా రెండో పెళ్లి అనే న్యూస్ వైరల్‌గా మారింది. భూమా మౌనిక రెడ్డితో కలిసి.. హైదరాబాద్‌లోని ఓ గణేశ్ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశాడు మనోజ్. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు.. ఓ మంచి రోజు చూసుకుని తానే అన్ని విషయాలు చెబుతానని చెప్పాడు. దాంతో త్వరలోనే మనోజ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చాడని అంటున్నారు. అయితే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. అలాగే పెళ్లి తర్వాతే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్. మొత్తంగా మనోజ్ ఇప్పుడు పర్సనల్‌గా అంతా సెట్ చేసుకొని.. పొలిటికల్‌గా ఎంట్రీ.. లేదా సినిమాలతో సాలిడ్‌గా రీ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.