Lakshmika Sajeevan: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, యువతీ యువకులకు కూడా గుండెపోటు రావడం ఆందోళన కలిగిస్తోంది. హర్ట్ ఎటాక్ ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఒకప్పుడు వయసు మీద పడ్డ వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేది. ఇప్పుడు పాతికేళ్ల లోపు వాళ్లు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. తాజాగా మలయాళ యువ నటి లక్ష్మిక సజీవన్(24) గుండెపోటుతో మృతి చెందింది. దుబాయ్ లోని షార్జాలో ఆమె కన్ను మూసింది. ఈ 24 ఏళ్ల హీరోయిన్ సినిమా షూటింగ్ సమయంలో గుండె ఆగిపోయినట్లు సమాచారం. ఇంత చిన్న వయస్సులో యంగ్ హీరోయిన్ చనిపోవడంతో మాలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.
లక్ష్మిక మృతిపై పలువురు సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. అజు అజీష్ డైరెక్ట్ చేసిన ‘కాక్క’ షార్ట్ ఫిల్మ్‌లో పంచమిగా నటించిన లక్ష్మిక.. అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. శారీరక వైకల్యాలతో అవహేళనకు గురైన అట్టడుగు ప్రజల బతుకు చిత్రమే ఈ కక్కా. రీసెంట్ గా లక్ష్మిక ఉయిరే, దుల్కర్ సల్మాన్ సౌదీ వెల్లక్క, ఒరు యామందం ప్రేమకథ, పంచవర్ణతథా తో పాటు పలు మూవీస్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. లక్ష్మిక తనకు వచ్చిన చిన్న చిన్న పాత్రలతో.. కెరీర్ మొదలు పెట్టి.. మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో.. లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి చెందడం..అందరినీ షాక్ కు గురి చేస్తుంది.