కెజియఫ్ చాప్టర్1, చాప్టర్ 2 సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ టేకింగ్, యష్ యాక్టింగ్ కెజియఫ్‌ను సెన్సేషనల్ చిత్రంగా నిలిపాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే ఫైట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. హై ఓల్టేజ్ పవర్ ఎలా ఉంటుందో.. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ కెజీయఫ్ సినిమాల స్పెషల్. అయితే ఈ ఫైట్స్‌ని కంపోజ్ చేసింది ఇద్దరు అన్నదమ్ములు. అంతకు ముందు.. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన కెజియఫ్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్నారు అన్బిరవ్ బ్రదర్స్. అలాగే ఇటీవల వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’కు వీళ్లే యాక్షన్, కట్ చెప్పారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న టాప్ మూవీస్‌కు.. దాదాపుగా ఈ ఇద్దరే ఫైట్ మాస్టర్స్‌గా పని చేస్తున్నారు. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’కు కూడా వీళ్లే ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ కోసం వీళ్లనే రంగంలోకి దింపారు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్.. ప్రాజెక్ట్ కెను పాన్ వరల్డ్ మూవీగా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది ఎండింగ్ లేదా.. 2024 సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కె’ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే.. తాజాగా ఈ సినిమా కోసం అన్బిరవ్ బ్రదర్స్‌ను రంగంలోకి దింపినట్టు సమాచారం. దాంతో ‘ప్రాజెక్ట్ కె’లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి ప్రభాస్ కోసం ఈ స్టంట్ బ్రదర్స్ ఎలాంటి ఫైట్స్ డిజైన్ చేస్తారో చూడాలి.