Kangana Ranaut: ఇండియా పేరు మారుస్తానంటున్న కంగనా రనౌత్..!
మన దేశం ఇండియా పేరును మార్చాలంటూ ఈ మధ్యకాంలో చర్చ మొదలైన విషయం తెలిసిందే. ఇండియా కాకుండా, భారత్ అని మార్చేయాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. భారతదేశం పేరును భారత్‌గా మార్చాలనే ప్రతిపాదనపై కంగనా రనౌత్ స్పందిస్తూ, పేరు మార్పు కోసం తాను గతంలో వాదించిన పాత ప్రకటనను పంచుకుంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవలి తన ట్వీట్లలో, ఆమె ‘భారత్’ పేరు ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ‘ఇండియా’ అనే పదానికి వలసవాద అర్థాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అందుకే మన దేశానికి భారత్ అని పేరు పెట్టాలని ఆమె కోరడం విశేషం. ఈ పేరు మార్చడానికి చరిత్ర ను కూడా ఆమె ఉదాహరణగా తీసుకున్నారు. ‘భారత్’ మహాభారత యుగం నాటి సాంస్కృతిక ప్రాముఖ్యతను లోతుగా పాతుకుపోయిందని ఆమె చెప్పారు.
ఇక కంగనా రనౌత్ ప్రస్తుతం చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను గతంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాను చూశానని ఆ సినిమాలో జ్యోతిక నటన ఎంతగానో నచ్చిందని కంగనా రనౌత్ వెల్లడించారు. జ్యోతిక నాకు స్పూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు.అయితే జ్యోతికతో తనను పోల్చుకోవద్దని కంగనా కామెంట్లు చేశారు.
నేను నటించిన రోల్ మాత్రమే అసలైన చంద్రముఖి అని కంగనా అన్నారు.కామెడీ, హర్రర్, ఫ్యామిలీ, ఇలా అన్ని అంశాలు ఉన్న సినిమాలో నటించడం సంతోషంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు.చంద్రముఖి2 చిత్ర యూనిట్ తో కలిసి నటించడం మంచి అనుభవం అని ఆమె అన్నారు.కంగనా రనౌత్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.