ఈ ఏడాది బింబిసార మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతున్న కళ్యాణ్ రామ్‌కు.. బింబిసార నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.
అలాగే ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దాంతో ఇదే జోష్‌లో నెక్ట్స్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఆడియెన్స్ కూడా కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ సినిమాల కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యడు. వాటిలో ముందుగా NKR19 ప్రాజెక్ట్ రాబోతోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘అమిగోస్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తున్నాడు. ‘బింబిసార’లో ద్విపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్.. ‘అమిగోస్’లో ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన అశికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నవీన్ మేడారం దర్శకత్వంలో పీరియాడికల్ స్టోరీతో ‘డెవిల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు కళ్యాణ్. ఇక ఎలాగూ బింబిసార సీక్వెల్ లైన్లో ఉంది.. ప్రస్తుతం బింబిసార2 స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి.. వీటితో పాటు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు కళ్యాణ్ రామ్. మరి అమిగోస్గా కళ్యాణ్ రామ్ ఈసారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.