ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఆస్కార్ రేసులో ఉండే ఛాన్స్ కూడా ఉంది. అందుకే కొరటాల శివతో భారీగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇలాంటి వార్తలు ఎన్టీఆర్ అభిమానులను గాల్లో తేలేలా చేస్తున్నా.. మరో విషయంలో మాత్రం నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ అప్టేడ్ లేక అప్సెట్ అవుతున్నారు. ఇక అంతకు మించి అన్నట్టు పొలిటికల్ డిస్టర్బెన్స్ వాళ్లను మరింత కలవర పెడుతోంది. ఈ మధ్య కాలంలో సినిమాల కంటే.. రాజకీయంగానే వేడి పుట్టిస్తున్నాడు యంగ్ టైగర్. ఇటీవల అమిత్ షాను కలవడంతో.. ఒక్కసారిగా పొలిటికల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు తారక్. ఆ మీటింగ్ సినిమా పరంగానే అయినా.. ఎన్నో సందేహాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇక ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో హాట్ టాపిక్ అయ్యాడు ఎన్టీఆర్. ఈ అంశంలో తారక్ స్పందించిన తీరు ఫ్యాన్స్‌ని బాగా డిజప్పాయింట్ చేసిందని అంటున్నారు. అయితే ఎందుకులే ఈ రాజకీయం అనుకున్నాడో ఏమోగానీ.. ఎవర్నీ నొప్పించక.. అందర్నీ మెప్పించే విధంగా.. ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. దాంతో కొందరు నందమూరి ఫ్యాన్స్ తారక్ పై మండిపడుతున్నారు. ఏదైనా సరే.. ఔట్, రైట్లా ఉండాలని.. కానీ ఇలా బ్యాలన్స్డ్గా ఉండమేంటని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఎన్టీఆర్‌కు ప్రశ్నించే దమ్ము లేదా అని విమర్శస్తున్నారు. దాంతో ఈ ఇష్యూపై అనవసరంగా స్పందించాడని.. అనిపించక మానదు. ఇలా ఎన్టీఆర్ సినిమాల కంటే పొలిటికల్ కామెంట్స్‌తోనే మరింత నిరాశకు గురవుతున్నారు తారక్ అభిమానులు.