»Imdb Popular Indian Celebrities Rashmika In Top Three
IMDB: పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్.. టాప్ 3లో రష్మిక
ప్రముఖ భారతీయ సెలబ్రిటీల(imdb Popular Indian celebrities) జాబితాలో రష్మిక(Rashmika Mandanna) టాప్ 5 జాబితాలో లిస్ట్ చేయబడిందని అధికారికంగా IMDb ట్వీట్ చేసింది. గత వారం ఆమె పుట్టినరోజు జరుపుకోవడం సహా పుష్ప 2 టీజర్ విడుదల చేయడంతో ఆమె పాపులారిటీ పెద్ద ఎత్తున పెరిగిందని తెలుస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన(Rashmika Mandanna) గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు కాంట్రవర్శీ లేదా గ్లామర్ షోతో రచ్చ చేస్తునే ఉంటుంది. అందుకే రష్మిక మరోసారి జాతీయ స్థాయిలో టాప్ సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా IMBD టాప్ 10 జాబితాలో మోస్ట్ క్రేజీ సెలబ్రెటీగా రష్మిక మందన్నా నిలిచింది. సినిమా అండ్ సెలబ్రెటీలకు రేటింగ్ ఇచ్చే ఆన్ లైన్ పోర్టల్ IMBD.. లేటెస్ట్గా పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ విడుదల చేసింది. ఆ జాబితాలో హీరోయిన్ రష్మిక మందన్న మూడో స్థానంలో నిలిచింది.
ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తునే.. మరో వైపు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాలో.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో రష్మిక పేరు మార్మోగిపోయింది. ఇదే సమయంలో పుష్ప ది రూల్ సినిమా నుంచి స్పెషల్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు కారణాలు ఒకే వారంలో జరగడంతో.. రష్మిక పేరు సోషల్ మీడియా(social media)లో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో IMBDలో టాప్ సెలబ్రెటీ జాబితాలో చోటు దక్కించుకుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నితిన్ సరసన మరోసారి(Rashmika Mandanna) రొమాన్స్ చేస్తోంది. ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ఇక బాలీవుడ్లో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రణ్ బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. మొత్తంగా ప్రస్తుతం రష్మిక క్రేజ్ ఓ రేంజ్లో ఉంది.