ఆహాలో వస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో.. బాలయ్య క్రేజ్‌తో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. ప్రస్తుతం సెకండ్ సీజన్‌తో అలరిస్తున్నారు బాలకృష్ణ. అయితే ఈ షో స్టార్ట్ అవకముందు.. బాలయ్య(balakrishna) నిజంగానే హోస్టింగ్ చేస్తున్నాడా.. అని ఆశ్చర్యపోయారు ఆడియెన్స్. ఇక ఇప్పుడు ఫస్ట్ టైమ్ కమర్షియల్ యాడ్ చేసి ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చారు. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ యాడ్‌లో నటించారు బాలయ్య. దీనికి సంబంధించిన ఈవెంట్ కూడా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
అయితే బాలయ్య ఈ యాడ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య యాడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. అందుకే తొలి యాడ్ కోసం దాదాపు 15 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. టైర్ 2 హీరోలకు కూడా ఇంత రెమ్యూనరేషన్ లేదు.. దాంతో బాలయ్యనా మజాకానా అంటున్నారు అభిమానులు. అయితే బాలయ్య నిజంగానే కమర్షియల్ ఇన్కమ్ కోసం ఈ యాడ్ చేయలేదు.. ఈ రెమ్యూనరేషన్ మొత్తాన్ని కూడా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారట.
ఈ విషయం వైరల్‌గా మారడంతో.. ఇది మా బాలయ్య బాబు అంటూ ఖుషీ అవతున్నారు నందమూరి అభిమానులు. ఇకపోతే.. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహా రెడ్డి’ అనే సినిమాలో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108వ సినిమా చేయబోతున్నారు.