Movie teaser: ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ టీజర్ రిలీజ్
చాలా రోజుల తర్వాత దర్శకుడు అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" పేరుతో ఈ సినిమా రూపొందింది.
చాలా రోజుల తర్వాత దర్శకుడు అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇది. “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” పేరుతో ఈ సినిమా రూపొందింది. కథలో లవ్ తో పాటుగా కాస్త ఫ్యామిలీ నేపథ్యాలను యాడ్ చేసి సినిమా తీయడంతో అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) దిట్ట. అందుకే ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రేమ ప్రధానమైన కుటుంబ సినిమాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కథల వల్లనే ఈ మధ్య సినిమాలు ఎక్కువ రోజులు ఆడగలుగుతున్నాయి.
అలాంటి కథాంశంతో తెరకెక్కిన సినిమానే “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి”. ఇందులో నాగశౌర్య(naga sourya) హీరోగా నటిస్తున్నారు. మాళవిక నాయర్ ఆయన జోడికట్టింది. ఈ మూవీని విశ్వ ప్రసాద్, దాసరి పద్మజలు నిర్మిస్తున్నారు. సినిమాకు అవసరాల శ్రీనివాస్(avasarala srinivas) దర్శకత్వం వహించడమే కాకుండా తానే కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్(Teaser) ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులోని హీరో, హీరోయిన్ పాత్రలను పరిచయం చేస్తూ టీజర్(Teaser) సాగుతుంది. ఆ పాత్రల చుట్టూ ఉండే సన్నివేశాలను టీజర్ లో కట్ చేసి చూపించారు. ఈ సినిమాకు కల్యాణి మాలిక్(kalyani malik) సంగీతాన్ని అందించారు. ఉగాది పండగ సందర్భంగా మార్చి 17వ తేదిన ఈ సినిమా రిలీజ్ కానుంది.