సినిమా వాళ్లు ఏ విసయం మాట్లడినా.. ఇప్పుడు క్షణాల్లో వైరల్గా మారుతోంది. ప్రస్తుతం హాట్ బ్యూటీ రష్మిక మందన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో.. తన డెబ్యూ మూవీ గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా నిర్మాణ సంస్థ గురించి ప్రస్తావించకుండా.. వేళ్ళతో సైగలు చేస్తూ చూపించింది రష్మిక.
ఈ విషయం కన్నడ సినీ అభిమానులకు మండి పడేలా చేసింది. అసలే కాంతార విషయంలో అమ్మడిపై పీకకల్లోతు కోపంలో ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆటిట్యూడ్ చూపించడంతో.. ఆమె మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. అమ్మడికి నోటి దూల ఎక్కువైందని అంటున్నారు. అంతేకాదు.. కన్నడ ఇండస్ట్రీ రష్మిక మీద బ్యాన్ విధించే ఆలోచన చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.
ఇందులో నిజముందో తెలియదు గానీ.. అదే జరిగితే రష్మిక డౌన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయినట్టేనని అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు. ఎందుకంటే.. ఇప్పుడొస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. అలాంటప్పుడు అమ్మడిని తమ సినిమాల్లో తీసుకొని.. కన్నడ మార్కెట్ లాస్ అయ్యేందుకు ఏ నిర్మాత కూడా ముందుకు రాడు.
అందుకే ఇప్పుడు రష్మిక రియలైజ్ అయిందనే న్యూస్ వినిపిస్తోంది. ఇదంతా కొందరు కావాలనే చేస్తున్నారని.. రష్మికకు కన్నడ ఇండస్ట్రీ మీద ఎంతో గౌరవం ఉందని.. తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని.. రష్మిక సన్నిహితులు అంటున్నారట. అయితే చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు సన్నిహితుల దగ్గర బాధపడితే ఏం లాభం అంటున్నారు కొందరు.. మరి అమ్మడు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.