పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో భారీ పీరియాడికల్ డ్రామాగా.. ‘హరిహర వీరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేయడం పవన్‌కు ఇదే తొలిసారి. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సగభాగానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను.. దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నారు. అందుకే ముందుగా వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాప్‌లో పవన్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొంటింది. ఇటీవలె అందుకు సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వర్క్ షాప్ వల్ల అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పటికే కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన భారీ సెట్‌ను కూడా నిర్మించినట్టు తెలుస్తోంది. వన్స్ షూటింగ్ మొదలు పెడితే.. నాన్‌స్టాప్‌గా కొట్టేయాలని చూస్తున్నారు పవన్. అందుకే వర్క్ షాప్‌కి అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ లేటెస్ట్ లుక్ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. షూటింగ్ డిలే అవుతుండడంతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఫైనల్‌గా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు టాక్. వచ్చే ఏడాది.. అంటే 2023 మే 12న హరిహర వీరమల్లును రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో.. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.