TG: రాష్ట్రం నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కానుండడంతో వీటిని దక్కించుకునేందుకు తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోనే భట్టి విక్రమార్క, పలువురు నేతలు, రాజ్యసభ ఆశావహులు ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడే మకాం వేశారు.