సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడ్డాయి. అందులో నాగ్, వెంకీ లాంటి సీనియర్ హీరోలు ఉండగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు. కానీ వీళ్లతో పోటీ పడి మరీ సాలిడ్ హిట్ కొట్టాడు యంగ్ హీరో తేజ సజ్జా. ప్రస్తుతం హనుమాన్ పై వసూళ్ల వర్షం కురుస్తోంది.
Hanuman: సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ దెబ్బ అదుర్స్ అనేలా ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు పోటీగా జనవరి 12న రిలీజ్ హినుమాన్ సినిమా.. డే వన్ నుంచే క్లీన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రజెంట్ బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతోంది. తక్కువ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. అదిరిపోయే ఆక్యుపెన్సీ మెంటైన్ చేస్తోంది. హనుమాన్ క్రేజ్‌కు తెలుగులో ఇంకా థియేటర్లు పెరుగుతునే ఉన్నాయి. అసలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఈ రేంజ్ హిట్ ఊహించి ఉండరు. అమలాపురం టు అమెరికా వరకు హనుమాన్ పై కాసుల వర్షం కురుస్తోంది.
ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే వరకు 150 కోట్ల గ్రాస్ రాబట్టిన హనుమాన్.. 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. 8వ రోజు కూడా 14 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది హనుమాన్. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది రోజుల్లో 164 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. మళ్లీ వీకెండ్ మొదలైంది కాబట్టి.. మండే వరకు 200 కోట్ల క్లబ్లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది హనుమన్. 22న అయోధ్య రామ మందిరం కార్యక్రమం ఉంది కాబట్టి.. నార్త్ బెల్ట్‌లో వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే నార్త్‌లో కెజియఫ్ చాప్టర్ వన్, కాంతార సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఓవర్సీస్లో టాప్ 5లోకి దూసుకొచ్చి ప్రభాస్, రాజమౌళి సినిమాల తర్వాతి ప్లేస్‌లో నిలిచింది. ఖచ్చితంగా హనుమాన్ సినిమా మేకర్స్ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను తెచ్చి పెట్టడం గ్యారెంటీ. మరి లాంగ్ రన్లో హనుమాన్ ఎంత రాబడుతుందో చూడాలి.