టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఎంత స్పీడ్‌గా సినిమాలు చేస్తుందో చూస్తునే ఉన్నాం. కానీ సక్సెస్ రేట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ యంగ్ బ్యూటీ ఇపుడు ఒక షాకింగ్ డెసిషన్ తీకున్నట్టుగా తెలుస్తోంది.
Srileela: గత నాలుగైదు నెలలుగా నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీ. పర్ఫార్మెన్స్ కంటే తన అద్భుతమైన డ్యాన్స్‌తో అదరగొడుతోంది అమ్మడు. ప్రస్తుతం థియేటర్లో రన్ అవుతున్న గుంటూరు కారం సినిమాలో తనదైన డ్యాన్స్‌తో దుమ్ముదులిపేసింది. కుర్చీ మడతబెట్టి.. అంటూ మహేష్ బాబుతో రచ్చ చేసింది. అయితే డ్యాన్స్ పరంగా శ్రీలీల క్రేజ్ వావ్ అనేలా ఉన్నప్పటికీ.. సినిమాల రిజల్ట్స్ మాత్రం తేడా కొట్టేస్తున్నాయి. గతేడాది శ్రీలీల నటించిన సినిమాల్లో ఒక్క భగవంత్ కేసరి తప్ప.. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
గుంటూరు కారం కూడా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. కానీ శ్రీలీల కథల ఎంపిక ఇలాగే ఉంటే అమ్మడి కెరీర్ డేంజర్ జోన్లో పడ్డట్టే. ఇప్పటికైన ఆచితూచి సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో శ్రీలీల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని బ్రేక్ తీసుకొని చదువుపై ఫోకస్ చేయాలని డిసైడ్ అయిందట. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతోంది. దీంతో కొన్ని రోజులు స్టడీస్ పై దృష్టి సారించాలని ఫిక్స్ అయిందట.
ఈ మధ్యే ఎగ్జామ్స్ కూడా రాసినట్టుగా వార్తలొచ్చాయి. ఇక బ్రేక్ తర్వాత మరింత జాగ్రత్తగా స్కిప్ట్స్ ఓకే చేయాలని భావిస్తుందట అమ్మడు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించాలని అనుకుంటోందట. లేదంటే.. నిర్మొహమాటంగా నో చెప్పాలని ఫిక్స్ అయిందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు మరికొన్ని సినిమాలున్నాయి. మరి.. ఇక పై శ్రీలీల ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.