Vijay Devarakonda: వాళ్లే రష్మికతో పెళ్లి చేయాలనుకుంటున్నారు..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎప్పటికీ హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి వార్తలు వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. రీసెంట్గా ఈ ఇద్దరు ఎంగేజ్మెంట్కు రెడీ అవుతున్నారంటూ వార్తలు రాగా.. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యాడు.
Vijay Devarakonda: గీతా గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే టాక్ నడుస్తునే ఉంది. ఈ ఇద్దరు కలిసి తరచుగా వెకేషన్స్‌కి వెళ్ళడం, డిన్నర్ డేట్స్ అంటూ సీక్రెట్‌గా వెళ్తునే సోషల్ మీడియాలో దొరికిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. అలాంటప్పుడు ఇద్దరు సీక్రెట్‌గా ఎందుకు చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారనే కామెంట్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.
తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ స్పందించారు. ఫిబ్రవరిలోనే ఎంగేజ్మెంట్ ఉంటుందని.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటి వరకు రష్మిక దీనిపై స్పందించలేదు గానీ.. తాజాగా విజయ్ దేవరకొండ మాత్రం స్పందించాడు. ఓ ఇంగ్లీష్ మేగజీన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అసలు ఇలాంటి వార్తల్లో నిజం లేదని.. కొంతమంది కావాలనే ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని అన్నాడు. ఇలాంటి రూమర్స్ ప్రతి ఏడాది వింటూ వస్తున్నాను.. వాళ్లే నన్ను పట్టుకొని పెళ్లి చేయాలని చూసున్నారేమో.. అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవర కొండ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. గీతా గోవిందం తర్వాత పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సమ్మర్లో ఫ్యామిలీ స్టార్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.