»Cancer Are You Eating While Standing But This Threat Is Inevitable
Cancer: నిలబడి తింటున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు!
ప్రస్తుతం చాలా మంది కూర్చుని తినడం కంటే నిల్చుని తినడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా నిల్చొని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Cancer: పూర్వం రోజుల్లో ఎక్కువగా బంతి భోజనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కువగా నిల్చుని తినే విధంగా ఉంటున్నాయి. ప్రస్తుత బిజీ ప్రపంచంలో చాలామందికి కూర్చుని తినే సమయం లేక నిల్చుని తింటున్నారు. ఇలా నిల్చుని తినడం వలల్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిల్చొని తినడం వల్ల పొట్ట, పేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట. కేవలం నిల్చొని తినడం వల్లే కాదు.. నిల్చొని నీరు తాగిన కూడా అన్నవాహిక సంబంధిత వ్యాధులు వస్తాయని పరిశోధనల్లో తేలింది.
నిల్చొని తినడం, తాగడం వల్ల అన్నవాహిక కండరాల పనితీరుకు అడ్డు తగిలి జీర్ణక్రియ పనితీరుపై ప్రభావం పడుతుందని పరిశోధకులు తెలిపారు. అది క్రమేణా అన్నవాహిక క్యాన్సర్కు దారితీస్తుందని వెల్లడించారు. అలాగే నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు. ఎక్కువగా తింటుంటారు. పేగులు కూడా కుంచించుకుపోతాయి. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. కాళ్లు, తుంటిపై చెడు ప్రభావం ఉంటుంది. గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళ్లడం వల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. దీంతో అల్సర్లు రావడంతో పాటు కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు కూడా పేరుకుపోతుంది.