Acharya Satyendra Das: దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూసే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఈ నెల 22న జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే అయోధ్య రామాలయం గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ చేయనున్న బాలరాముడి విగ్రహ ఫొటోలు నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన కొన్ని ఫొటోలలో రాముడి కండ్లకు పసుపు వర్ణ వస్త్రం కట్టి ఉంటే.. మరికొన్ని ఫొటోలలో నేత్రాలకు పసుపు వర్ణ వస్త్రం లేదు. దీనిపై రామజన్మభూమి తీర్థక్షేత్ర ముఖ్య పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తాజాగా స్పందించారు.
#WATCH | Ayodhya: On the idol of Lord Ram, Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, "…The eyes of Lord Ram's idol cannot be revealed before Pran Pratishtha is completed. The idol where the eyes of Lord Ram can be seen is not the real idol. If… pic.twitter.com/I0FjRfCQRp
ప్రాణ ప్రతిష్ఠ పూర్తి అయ్యే వరకు శ్రీరాముడి విగ్రహం కండ్లను బహిర్గతం చేయరాదని తెలిపారు. కండ్లకు ఉన్న వస్త్రాన్ని తీసి ఉన్న ఫొటోలు నిజమైనవి కావని తెలిపారు. ఈ నేత్రాలపై విచారణ చేపట్టాలన్నారు. అసలు కండ్లను ఎవరు చూపించారు, ఆ ఫొటోలు బయటకు ఎలా వెళ్లాయో తెలియాలన్నారు. మైసూరుకు చెందిన శిల్పి యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని చెక్కారు. 51 అంగుళాల విగ్రహాన్ని కృష్ణ శిలపై చెక్కారు. శిల్పి యోగిరాజ్ మొదట్లో కార్పొరేట్ ఉద్యోగంలో చేరినా తర్వాత శిల్పకళ వైపు వెళ్లారు.