హీరో సూర్య 47వ చిత్రానికి మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని సమాచారం. ఈ మూవీలో నటి నజ్రియా హీరోయిన్గా నటించనున్నట్లు తెలుస్తోంది. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.