టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైలెంట్‌గా ఓ సినిమాను ఓపెనింగ్ చేశారు. ఈ సినిమా ఓపెనింగ్ నుంచి ఓ ఫొటో లీక్ కావడంతో వైరల్‌గా మారింది. గతంలో ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోందని రూమర్స్ వచ్చాయి. అయితే, విజయ్ కొత్త సినిమా ఓపెనింగ్‌లో కీర్తి సురేష్ కనిపించడంతో ఆమెనే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.