NZB: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆశావహుల నుంచి ఈ నెల 12వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. కర్ణాటక ఎమ్మెల్యే రిజ్వాన్‌ను జిల్లా పరిశీలకుడిగా నియమించారు. ప్రస్తుతం ఏడేళ్లుగా మానాల మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాబోయే 15 రోజుల్లో కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.