తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశీ పట్టణంలోని బాణాసంచా కేంద్రంలో పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల్లో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.