KMM: ఖమ్మం నగరం వీడియోస్ కాలనీకి చెందిన కార్పొరేటర్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల అండదండలతో రౌడీ మూకలు చెలరేగిపోతున్నారంటూ, రౌడీలను నియంత్రించాలని కోరుతూ.. కాలనీవాసులతో కలిసి ఆమె వీడియోస్ కాలనీలోని రోడ్డుపై బైఠాయించారు. ఆడవారిని సైతం ఇబ్బందులు గురి చేస్తున్నారని రౌడీ మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.