ADB: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ సాంప్రదాయ పండుగలకు ఆదరణ కరువైందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం పట్టణంలోని బతుకమ్మ నిమర్జనం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి జోగు రామన్న దంపతులు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. గత ప్రభుత్వం తెలంగాణ సంప్రదాయ పండుగగా గుర్తించి మహిళలకు బతుకమ్మ చీరలను అందించిందని పేర్కొన్నారు.