మేడ్చల్: ఘట్కేసర్ పట్టణంలోని 1939లో నిర్మించిన గురుకుల్ ఎయిడెడ్ స్కూల్ శిథిలావస్థకు చేరుకుంది. ప్రైవేట్ స్కూళ్ల ప్రభావం, అడ్మిషన్లు లేకపోవడంవల్ల ఈ విద్యా సంవత్సరంలో కేవలం 18 మంది విద్యార్థులు మాత్రమే నమోదు అయ్యారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు లేకపోవడంతో, పరీక్షలు దగ్గరపడుతున్న తరుణంలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.