AKP: నాతవరం మండలంలో బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాలలో ఎస్సై తారకేశ్వరరావు శనివారం అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ప్రమాదం జరిగితే ఏ విధంగా స్పందించాలో ఎమర్జెన్సీ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించారు. తప్పనిసరిగా భద్రత ప్రమాణాలు పాటించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.