WGL: ఉపాధ్యాయులు విద్యార్థులకు న్యాయమైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద సూచించారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో గల మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల వసతి సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న భోజనం, తరగతుల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, శుభ్రత వంటి అంశాలను పరిశీలించారు.