MNCL: PM మోదీ రైతుల సంక్షేమార్థం రూ.42 వేల కోట్ల లాభదాయక పథకాలను ప్రారంభించడం జరిగిందని బెల్లంపల్లి KVK సమన్వయకర్త ప్రసూన తెలిపారు. శనివారం PM ధన ధాన్య కృషి యోజన కార్యక్రమం రైతులకు ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. రైతులు KVK కేంద్రం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన సేవలు అందిపుచ్చుకోవాలన్నారు. రైతులు శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండించి లాభాలు సాధించలన్నారు.