SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం కోడె మ్రొక్కుబడులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్య కల్యాణము వంటి సేవలు 11-10-2025 శనివారం నుండి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అందుబాటులో ఉంటాయి. నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు గమనించాలని ఒక ప్రకటనలో కోరారు.