SKLM: తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్శ యోజన స్కాలర్ షిప్ టెస్ట్ ఆదివారం జరగనుందని పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని ఆయన పేర్కొన్నారు. పరీక్ష ఉదయం 10 నుండి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.