NRML: భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను అలాగే కేసుల పురోగతిని తెలుసుకొన్నారు. అనంతరం పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. గ్రామాలలో గస్తీ, పెట్రోలింగ్ చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో రూరల్ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.