SKLM: మందస మండలంలోని అంబుగాం గ్రామంలో పవన పుత్ర సేవా సంస్థ శనివారం ప్రాథమిక పాఠశాలల స్థాయి క్విజ్ పోటీలలో నిర్వహించారు. ప్రాధమిక పాఠశాల విద్యార్థులు మొదటి పది స్థానాల్లో విజేతలుగా నిలిచినట్టు ప్రధానోపాధ్యాయులు గున్న గంగాధరరావు తెలిపారు. విద్యార్థులకు నగదుతో పాటు షిల్డ్ బహుమతులు అందజేశారు. విద్యార్థులను తోటి సిబ్బందితో పాటు గ్రామస్థులు అభినందించారు.