PDPL: మంథని మేర సంఘం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీధరా బాబు చిత్ర పటానికి మేర సంఘం నాయకులు క్షీరాభిషేకం చేశారు. మంథనిలో మేర కుల సంఘ భవన నిర్మాణానికి రూ.20 లక్షలను మంజూరు చేయడం పట్ల మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేర సంఘం నాయకులు పాల్గొన్నారు.