NLG:ఎల్ఐసీ NLG బ్రాంచ్-2 ఆధ్వర్యంలో శనివారం చండూరులో ఏజెంట్ల సమావేశం జరిగింది. బ్రాంచ్ ఏర్పడి 33 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 21న ఫార్మేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ మునీంద్ర తెలిపారు. ప్రైవేట్ సంస్థలు ఎన్ని ఉన్నా, ఎల్ఐసీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.